‘పవన్ కు తిక్కైతే నాకు పిచ్చి’

pavan erratic avanthi srinivas madసినీనటుడు పవన్ కల్యాణ్ కు తిక్క ఉంటే తనకు పిచ్చి ఉందని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి సభలో పవన్ టీడీపీ ఎంపీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి ఎంపీ.. జనసేన అధినేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

‘పవన్ ఏమంటాడు?.. మేం సార్.. సార్.. అని అడుక్కుంటున్నామా? మరి ప్రధాన మంత్రి గారిని ‘సార్’ అనకుంటే ఏమనాలి? ఎదుటివారికి నీతులు చెబుతున్న పవన్ తానేం చేస్తున్నాడు? ఆయనకు తిక్క ఉంటే నాకైతే పిచ్చి ఉంది’ అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు ఇప్పటివరకు 23 సార్లు ఢిల్లీకి వెళ్లారని గుర్తుచేశారు. నీతులు వల్లించడం మాని, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల తరఫున పోరాడాలని పవన్ కల్యాణ్ కు సూచించారు.

శనివారం తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. టీడీపీ అధ్యక్షుణ్ని, పార్టీ విధానాలను కాకుండా కేవలం ఒకరిద్దరు ఎంపీలను మాత్రమే టార్గెట్ చేయడంపై ఆ పార్టీ పార్లమెంటేరియన్లు గుర్రుగా ఉన్నారు. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేసి.. పవన్ ఏదేదో మాట్లాడుతున్నారని, అసలు తనకు ఎంపీ పదవి వెంట్రుకతో సమానం అని జనసేన అధినేతకు ఘాటుగా సమాధానం చెప్పిన సంగతి తెలిసిందే.

SHARE