‘ఛల్ ఛల్ గుర్రం’కి పవన్ అభినందన….

 Posted October 24, 2016

chal chal gurram movie teamశైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. మోహన ప్రసాద్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తాజాగా, ఈ చిత్ర బృందాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. ” ‘ఛల్ ఛల్ గుర్రం’ పాటలు బాగున్నాయ్.

దర్శకుడు మోహన్ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు. దీపావఌ కి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రేక్షకులని అలరిస్తుందని ఆశిస్తున్నా’నన్నారు పవన్. పవన్ ప్రశంస దక్కడంతో ‘ఛల్ ఛల్ గుర్రం’ చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం వెంగి. ఎం.రాఘవయ్య నిర్మాత.

 

SHARE