పవన్ మూవీ టైటిల్ ‘కాటమ రాయుడా’

pavan next movie title katama rayuda

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ డాలి డైరక్షన్లో రాబోతున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కొంత పార్ట్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షెడ్యూల్ జరుపుకుంటుంది అయితే ఈ షెడ్యూల్ లో పవన్ త్వరలో పాల్గొనే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా టైటిల్ ‘కాటమ రాయుడా’ అని పెట్టినట్టు ఎక్స్ క్లూజివ్ న్యూస్. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

ఆకుల శివ అందించిన ఈ కథకు ముందు ఎస్.జె సూర్య డైరక్షన్ చేయాల్సి ఉంది. కాని సూర్య నటుడిగా బిజీ అవ్వడంతో సూర్య బయటకు పోవడంతో (కిశోర్ కుమార్) డాలి ఈ మూవీలో ఎంట్రీ ఇచ్చాడు. గోపాల గోపాల తర్వాత పవన్ తో సినిమా చేస్తున్న డాలి సినిమా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చేందుకు కృషి చేస్తున్నాడు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి కాటమ రాయుడా అంటూ అత్తారింటికి దారేదిలో పాటెత్తుకున్న పవన్ ఈసారి అదే టైటిల్ తో ఫ్యాన్స్ ను మరింత ఖుషి చేసేందుకు వస్తున్నాడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

SHARE