పవన్-త్రివిక్రమ్ సినిమా.. టైటిల్ ఇదే !

Posted October 3, 2016

pavan trivikram movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం
తెలిసిందే. ఇటీవలే షూటింగ్ లో జాయిన్ అయిన పవన్.. ఇకపై జెడ్ స్వీడుతో
షూటింగ్ ని పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. డాలీ దర్శకత్వంలో
తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతి హాసన్ జతకట్టనుంది. రాయలసీమ
ఫాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్
గా కనిపించబోతున్నట్టు చెబుతున్నారు.

ఇదిలావుండగా.. ‘కాటమరాయుడు’ తర్వాత పవన్-త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా
రానుంది. ప్రస్తుతం పవన్ సినిమాని స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో
ఉన్నాడు త్రివిక్రమ్. అయితే, ఈ సినిమా కోసం ‘దేవుడే దిగొచ్చినా.. ‘
టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారమ్. నాగార్జున “సంతోషం” చిత్రంలోని
‘దేవుడే దిగి వచ్చినా’ .. పాటలోని మొదటి పదాలను టైటిల్ గా
తీసుకోబోతున్నారని చెబుతున్నారు. ఇప్పుడీ  ‘దేవుడే దిగొచ్చినా.. ‘ పవన్
టైటిల్ గా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ దేవుడిగా
అభిమానించే అభిమానులున్నారు. ఆ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే
త్రివిక్రమ్ స్క్రిప్ట్ కి పదను పెడుతున్న తెలుస్తోంది.

అయితే, ఈ టైటిల్ పవన్ ఫ్యాన్స్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసినట్టు
అర్థమవుతోంది. పవన్ ఫ్యాన్స్ గ్రూప్స్ లో ఈ టైటిల్ హల్ చల్ చేస్తోంది.
మరి.. పవన్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్ ‘దేవుడే దిగి వచ్చినా.. ‘
మారదేమో ! చూడాలి.

SHARE