పవన్ ఛాన్స్ ఫాలోయింగ్ పెంచేసింది..!

Posted November 19, 2016

Pawan Chance Keerti Surprise Followersపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ కొట్టేశా అంటూ ఎనౌన్స్ చేసి ఇంతకుముందు ఉన్న ఫాలోయింగ్ కన్నా ఎక్కువ ఫాలోవర్స్ ను పెంచుకుంది లక్కీ హీరోయిన్ కీర్తి సురేష్. నేను శైలజతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం నేను లోకల్ మూవీలో నానితో రొమాన్స్ చేస్తుంది. నేను శైలజ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేసిన కీర్తి అక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.

ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ త్రివిక్రం కాంబినేషన్లో మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. పవన్ సినిమా అనగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కీర్తిని ఫాలో అవడం మొదలు పెట్టారు. నిన్న మొన్నటిదాకా 30 లక్షల ఫాలోవర్స్ దాకా ఉన్న కీర్తికి ఇప్పుడు ఏకంగా హాఫ్ మిలియన్ ఫాలోవర్స్ కనిపిస్తున్నారు. సో స్టార్స్ సినిమా ఓకే కాగానే ఆమె గురించి తెలుసుకునే వాళ్లు ఎక్కువయ్యారన్నమాట.

అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ ఒక హీరోయిన్ గా ఉండొచ్చని అంటున్నారు. సో మొత్తానికి స్టార్ హీరోయిన్స్ గా చెలామని అవుతున్న ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ అందరికి కీర్తి సురేష్ భలే షాక్ ఇచ్చింది.

SHARE