పవన్..బాబు లవ్ గేమ్

 pawan chandrababu love game

ఒకే గోదా..ఇద్దరు పోటీదారులు …ఏమవుతుంది ?యుద్ధం మొదలవుతుంది…కానీ ఏపీ గోదాలో మాత్రం ఇద్దరు పోటీదారులు ఎంచక్కా లవ్ గేమ్ ఆడుకుంటున్నారు.రాజకీయాల్లో తలపండిన వాళ్లకి కూడా ఈ గేమ్ రూల్స్ ,రెగ్యులేషన్స్ అర్ధం కావడం లేదు .ఆటలో ఎవరు గెలుస్తున్నారో,ఎవరు ఆడుతున్నారో అంతకన్నా అర్ధం కావడం లేదు.కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ రోజు పవన్, చంద్రబాబు పరస్పరం ఇద్దరూ ఇచ్చిపుచ్చుకున్న మర్యాదతో ఆ లవ్ గేమ్ పీక్స్ కి వెళ్ళింది.

హోదాపై కమలం రెక్కలు ఊడేలా ఊదిపారేసిన పవన్ సైకిల్ ని మాత్రం నాజూగ్గా టచ్ చేశారు.పాచి లడ్డులు ఇచ్చిన కేంద్రం పై నిప్పులు చెరిగిన పవన్ ..దాన్ని స్వాగతించిన బాబుని పెద్దగా తప్పుబట్టలేదు.ప్యాకేజ్ ని పవన్ పాచి లడ్లు అంటున్నాడని దేశం ఎమ్మెల్యేలు చెబితే…సీమాంధ్ర కోసం ఎవరు పోరాడినా స్వాగతిద్దాం అని చెప్పారు.అంతటితో ఊరుకోలేదు …పవన్ విషయంలో జాగ్రత్తగా మాట్లాడమని వారికి హితబోధ చేశారు.ఈ లవ్ గేమ్ ని టీడీపీ,జనసేన వర్గాలు ఆలా గమనిస్తూ ఉంటున్నాయి ..కానీ వైసీపీకి మాత్రం ఎక్కడో కాలుతోంది .ఆలా అని ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు ..లవ్ లో ఉన్నోళ్లు ఇద్దరూ కావాల్సిన వాళ్ళు కాదు.అయినా మంట…అదే రాజకీయ సిత్రం

SHARE