పవన్ కన్నా ఆయన కటౌట్ వేల్యూ ఎక్కువా?

Posted April 4, 2017

pawan cutout value is more than him
కంటికెదురుగా ఓ మనిషి వున్నా పట్టించుకోకుండా ..అదే మనిషి ఫోటోకి దండాలు పెడుతూ పూనకాలతో వూగిపోతుంటే ఎలా ఉంటుంది ? ఆ ఊహ బయట వున్న మనకే వింతగా అనిపిస్తుంటే ఇక ఆ స్థానంలో వున్న మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే సీన్ లో వున్నారు.ఆయన నటించిన కాటమరాయుడు సినిమా కలెక్షన్స్ అంతంత మాత్రం గానే వున్నాయి.అభిమానులు కూడా ఆ సినిమాని పెద్దగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. కానీ అదే ఫ్యాన్స్ కాటమరాయుడుకి పోటీగా వచ్చిన గురు చూసి ,అందులో పవన్ ని పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు.అదేమిటి …గురులో హీరో వెంకీ కదా అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నా …

గురు లో మెయిన్ క్యారెక్టర్ వేసిన ఫిమేల్ లీడ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. ఓ వైపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఎక్కడైనా పవర్ స్టార్ పోస్టర్,కటౌట్,సినిమా కనిపించినా పిచ్చిగా ఊగిపోతోంది.ఈ సీన్స్ ని పవన్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.సినిమాలో పవన్ ఎపిసోడ్ మంచి వినోదం పంచింది.గురు కలెక్షన్స్ అంతకంతకీ పెరగడానికి దోహదపడుతోంది.ఓ వైపు కాటమరాయుడు ని బాక్సాఫీస్ వద్ద దెబ్బ కొడుతున్న గురు అదే పవన్ ని వాడుకుని కలెక్షన్స్ కొల్లగొట్టడం చూస్తుంటే వింతనిపించడం లేదూ? పవన్ కన్నా ఆయన కటౌట్ వేల్యూ ఎక్కువా అని బాధ అనిపించడం లేదూ?

SHARE