పవన్ కి కాదు సాక్షి కి పజిల్ ..

  pawan fazil sakshi news paper
సాక్షి కి మరో టార్గెట్ దొరికింది.ఇప్పటిదాకా చంద్రబాబుని మాత్రమే వెంటాడే సాక్షి కి ఇప్పుడు పవన్ కూడా తోడయ్యాడు.కాకినాడ సభని విశ్లేషిస్తూ పవన్ ..పజిల్ అంటూ సాక్షి ఓ కధనాన్ని ప్రచురించింది. అందులో పవన్ ప్రసంగాన్ని ఏకేసింది.బాబుని పవన్ ఎందుకు తిట్టడం లేదని సాక్షి తెగ బాధపడిపోయింది.అయితే ఆయన ఎందుకలా చేస్తున్నాడో చెప్పలేకపోయింది.పైగా అవంతి శ్రీనివాస్ రాజీనామా కోరే పవన్ …సుజనా ,అశోక గజపతి రాజు ల గురించి ఎందుకు మాట్లాడ్డం లేదని సాక్షి ప్రశ్నించింది.దక్షిణాది,ఉత్తరాది రాష్ట్రాల మధ్య వివక్ష గురించి ప్రస్తావించిన పవన్ బీజేపీ లో ఒక్క వెంకయ్యనాయుడిని టార్గెట్ ఎందుకు చేశారని సాక్షి డౌట్ పడింది.వైసీపీ తలపెట్టిన బంద్ కి కూడా పవన్ పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని సాక్షి వాపోయింది.మరి పోరాడాలని చెబుతూనే ఇదేంటని ప్రశ్నించింది.

ఇదంతా చూస్తున్న పవన్ అభిమానులు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు.హోదా కోసం ఢిల్లీ మీద పోరాటం చేయాలి ..పవన్ అదే చేస్తున్నారు.కానీ ప్రధాని మోడీ పేరెత్తకుండా జగన్ హోదా పోరాటం ఎలా చేస్తారని ఎదురు ప్రశ్నించారు పవన్ అభిమానులు .కేవలం చంద్రబాబుని తిడితే హోదా వస్తుందా అని నిలదీస్తున్నారు.ఈ ప్రశ్నల కి సాక్షి జవాబు ఇవ్వాలని కోరుతున్నారు.అసలే పవన్ ప్రసంగం పజిల్ విప్పలేక సతమతమవుతుంటే ఇదొకటా అని సాక్షి తల పట్టుకుంటోంది.

SHARE