‘సోషల్ సేన’గా పవన్ జనసేన

Posted October 6, 2016

 pawan janasena party create social media accounts

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ గ్రాఫ్ ని పక్కగా ప్లాన్ చేసుకొంటున్నట్టు సమాచారమ్. 2019 ఎన్నికల్లో జనసేన  ఒంటిరిగానే బరిలోకి దిగనుందని పవన్ ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 2018 నుంచి పవన్ పొలిటికల్ గా బిజీ కానున్నాడు. ఈలోపు ఇప్పటికే కమిట్ మెంట్ ఇచ్చిన నాలుగు సినిమాలని పూర్తి చేసే పనిలో పవన్ ఉన్నాడు.

అయితే, ఈలోపు ‘జనసేన పార్టీ’ సిద్దాంతాలని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడు పవన్. ఇందుకోసం సోషల్ మీడియాని విరివిగా  ఉపయోగించుకోనున్నారు. ఇప్పటికే జనసేన పేరిట ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాలని తెరిచారు.తాజాగా, జనసేన యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించారు.  మరో
యేడాది లోగా సోషల్ మీడియా ద్వారా ప్రతి జనసేన కార్యకర్తకి దగ్గర కావాలన్నది పవన్ లక్ష్యంగా కనబడుతోంది. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు  మాదిరిగా పవన్ కూడా పార్టీ కార్యకలాపాల్లో టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవాలని జనసేన డిసైడ్ అయ్యింది.

ఇప్పటికే సోషల్ మీడియాలో పవన్ కి ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే, ఈ ఫాలోయింగ్ ‘జనసేన పార్టీ’కి కూడా తోడవ్వాలని.. ఆదిశగా ప్రయత్నాలు  మొదలయ్యాయి.

SHARE