జనసేనతో నడవాలంటే ?

Posted October 6, 2016

  pawan janasena party rules
జనసేనకు ఓ సిద్ధాంతం ఉందా?జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానమేమిటి? ఈ ప్రశ్నలే విమర్శలుగా వస్తున్న వేళ జనసేన వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధమైంది.అందుకు సామాజిక మాధ్యమాల్ని వేదికగా చేసుకుంది.తాజాగా ఆ పార్టీ ఫేస్ బుక్ ,ట్విట్టర్,యు ట్యూబ్ ఖాతాలు ప్రారంభించింది.జనసేనతో నడవాలనుకుంటే ఆ ఖాతాల్ని ఫాలో  అవ్వాల్సిఉంటుంది.సినిమాల తరహాలో పార్టీకి ఓ టీజర్ రూపొందించి యు ట్యూబ్ లో పెట్టింది.

కాకినాడలో పవన్ నిర్వహించిన ఆంధ్రుల ఆత్మగౌరవ సభ కి వచ్చిన ఓ అభిమాని ప్రమాదవశాత్తు చనిపోవడంతో ఇకపై అలాంటి భారీ సమావేశాలకు దూరంగా వుండాలని అయన నిర్ణయించుకున్నారని వార్తలొచ్చాయి.అందుకే అయన సోషల్ మీడియా ద్వారా ప్రజాక్షేత్రానికి టచ్ లో వుండాలని భావిస్తున్నారు.దీంతో పాటు ప్రస్తుతం పవన్ రాస్తున్న ‘నేను-జనం – మనం’ అనే పుస్తకంలో పార్టీ సిద్ధాంతాల్ని వివరిస్తున్నారు.ఆ పుస్తకానికి మార్పు కోసం యుద్ధం అనేది టాగ్ లైన్ .
పవన్ సాంప్రదాయ రాజకీయ పార్టీల వ్యవహారశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పలేకపోయినా ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు.అయితే ప్రస్తుత సమాజం దాన్ని ఆకళింపు చేసుకునే పరిస్థితుల్లో ఉందా అంటే ఎస్ అని చెప్పలేని పరిస్థితి.అలా అని ఇది తప్పని ఇప్పుడే చెప్పడం తొందరపాటే.సరికొత్త ప్రయత్నాలెప్పుడూ భిన్నంగానే ఉంటాయి.పవన్ ప్రయత్నం ఏ కోవలోకి వస్తుందో..జనసేన జర్నీ ఎలా సాగుతుందో చెప్పేందుకు ఇంకొంత కాలం వెయిట్ చెయ్యాల్సిందే .

[wpdevart_youtube]pcd_r91cYdg[/wpdevart_youtube]

SHARE