పవన్‌ 4వ సారి తండ్రి కాబోతున్నాడు

0
694
pawan kalyan 3rd wife anna lezhneva will born baby

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

pawan kalyan 3rd wife anna lezhneva will born babyపవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్లిలు చేసుకున్న విషయం అందరికి తెల్సిన విషయమే. మొదటి భార్యతో పిల్లలేం లేని పవన్‌ కళ్యాణ్‌కు రెండవ భార్య రేణు దేశాయ్‌తో కలిసి ఇద్దరు పిల్లలను కన్నాడు. కొన్ని కారణాల వల్ల రేణు దేశాయ్‌ నుండి విడాకులు తీసుకున్న పవన్‌ కళ్యాణ్‌ రష్యకు చెందిన అన్నా లెజినావాను అధికారికంగా వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆమెతో కలిసి ఒక పాపకు జన్మనిచ్చాడు. మళ్లీ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ మూడవ భార్య రెండవ సారి గర్బవతి అన్నట్లుగా మెగా వర్గాల నుండి సమాచారం అందుతుంది.

పవన్‌ వ్యక్తిగత విషయాలను ఎప్పుడు కూడా పబ్లిక్‌ ముందుకు తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించడు. అలాగే ఈసారి కూడా తన భార్య గర్బవతి అనే విషయాన్ని బయటకు చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదు. కాని ఎన్నాళ్లు అని ఆ విషయం దాగుతుంది చెప్పండి. అందుకే పవన్‌ సన్నిహితుల నుండి అన్నా లెజనోవా గర్బవతి అనే విషయం లీక్‌ అయ్యింది. పవన్‌ నాల్గవ సారి తండ్రి కాబోతున్నట్లుగా మెగా ఫ్యామిలీకి చెందిన కొందరు అధికారికంగా కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ త్రివిక్రమ్‌ సినిమాతో చాలా బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మరో వైపు జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో కూడా ఉన్నాడు.

Leave a Reply