4 సినిమాలతో పవన్ బిజీ.. అవేంటో తెలుసా ?

Posted October 5, 2016

 pawan kalyan act back to back 4 movies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుందంటే ఆ క్రేజీయే వేరు. పవన్ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా..?అని పడిగాపులు కాసే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే,  పవన్ మాత్రం యేడాదికి ఒకటి,అర చిత్రాలతో మాత్రమే చేస్తూఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు.అలాంటి పవన్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలని లైనో పెట్టేశాడని  తెలిస్తే.. పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవనుకోండీ. ఇప్పుడదే జరుగుతోంది.

పవన్ వరుసగా నాలుగు సినిమాల లైనో పెట్టినట్టు సమాచారమ్. ఈ నాలుగు చిత్రాలు కూడా 2019లోపు పూర్తి చేయాలని పవన్ పట్టుదలతో ఉన్నాడు.  ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ సినిమా ని పట్టాలెక్కంచనున్నాడు. పవన్ కోసం పవర్ ఫుల్
పొలిటికల్ డ్రాప్ లో ఓ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్.

త్రివిక్రమ్ సినిమా చేస్తుండగానే దాసరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నటు సమాచారమ్. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరు.. ? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. వీటితో పాటుగా మరో ఒకట్రెండు సినిమాలకి చర్చలు జరుగుతున్నాయట. 2019 సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనున్న ‘జనసేన పార్టీ’ … ఆ లోపు నాలుగు సినిమాలతో ప్రేక్షకులని అలరించేందుకు పవన్ ప్లాన్ చేశాడు.

ఈ లెక్కన యేదాదికి పవన్ 2 సినిమాలనైనా రిలీజ్ చేయబోతున్నాడన్న మాట.ఈ న్యూస్ పవన్ ఫ్యాన్ పండగ చేసుకొనేదే. మరి.. పవన్ నాలుగు సినిమాలు  ప్రేక్షకులని ఏ మేరకు అలరించనున్నాయన్నది చూడాలి.

SHARE