బోయపాటి వెనుక ఓట్ల రాజకీయమా?

 pawan kalyan act  boyapati srinu direction politics purpose

ఓ వైపు చిరు, బాలయ్యలు బోయపాటి డైరెక్షన్ లో చేయాలని పోటీపడుతున్నారు. ఈ టైమ్ లోనే మరో పేరూ ముందుకు వచ్చింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈయన కూడా బోయపాటి డైరెక్షన్ లో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్టు ఫిలిం నగర్ టాక్… ఎందుకు? ఒక్కసారిగా హీరోలంతా బోయపాటివైపు చూస్తున్నారు. ఒకప్పుడు ఆయన హిట్ కొట్టి కూడా సంవత్సరం పైగా ఖాళీగా వున్న సందర్భాలున్నాయి. ఇంతలో ఈ మార్పు ఎలా వచ్చింది. ఆ మార్పు వెనక రాజకీయం ఉంది. అవును. అదెలాగో మీరే చూడండి.

2014 ఎన్నికలకు ముందు బాలయ్యతో బోయపాటి తీసిన లెజండ్ భారీ హిట్ అయింది. ఎన్నికల్లో పోటీచేసిన బాలయ్యకు, తెలుగు దేశం పార్టీకి కూడా ఆ సినిమా వల్ల మైలేజ్ పెరిగిందని అప్పట్లో వైసీపీ వర్గాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా మాస్ సినిమాల విషయంలో బోయపాటి పట్టు చూసిన హీరోలు ముఖ్యంగా రాజకీయాల్లో ఎదగాలనుకునేవాళ్లు … బోయపాటిని ఆశ్రయిస్తున్నారు. బాలయ్య, చిరంజీవి ఇద్దరు రాజకీయాల్లోను ఒక కాలు పెట్టి వున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే పని చేయబోతున్నారు. అందుకే వీళ్లంతా బోయపాటి సినిమాలు కలెక్షన్స్ తో పటు ఓట్లు కూడా రాలుస్తాయని భావిస్తున్నారు. అందుకే ఒక్కసారిగా బోయపాటికి డిమాండ్ పెరిగింది.

SHARE