పవన్ సీరియస్ ..ఇదిగో రూట్ మ్యాప్

0
523
pawan kalyan active in janasena party candidates selections from anantapur

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

pawan kalyan active in janasena party candidates selections from anantapur
“రాజకీయాలు చేయాలంటే మేధావులు కానక్కర్లేదు..సామాన్యులైనా నిజాయితీ,విలువలు పాటిస్తే రాజకీయాల్లో రాణించగలరు.”…ఈ మాటలు వింటుంటేనే ఎంత ఉత్సాహం వస్తోంది.ఇదేదో రాజకీయ తత్వవేత్త చెప్పిన మాటలు కావు.జనసేన అధినేత పవన్ చెప్పిన మాట.అయితే ఈ మాటలు చెప్పడం ఎంత తేలికో..ఆచరించడం అంత కష్టం.ఈ విషయం పవన్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ప్రజారాజ్యం అనుభవాన్ని దగ్గరుండి ఆయన చూసాడు. అప్పటికి అధికారానికి దూరంగా ఉంటున్న వర్గాలకి ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రజారాజ్యం కూడా చెప్పింది.అమల్లోకి వచ్చేసరికి అన్ని పార్టీల్లోని నాయకులకు ఆహ్వానం పలకడంతో సరిపోయింది.కానీ ఈసారి అలా జరక్కూడదన్న కృత నిశ్చయంతో పవన్ ట్రై చేస్తున్నారు.పార్టీ కార్యకర్తలు,నేతల్ని వారి అభిప్రాయాలు,విలువల ఆధారంగా నిర్ణయించే సరికొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.నిజంగా ఇది రాజకీయాల్లో ఓ విప్లవమే.

అనంతపురంలో కొత్త తరహాలో పార్టీ కార్యకర్తల్ని ఎంపిక చేసుకున్న పవన్ త్వరలో అక్కడ నుంచే పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు.ఆ పాదయాత్ర ద్వారా ప్రజాసమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారాలపై ఓ సమగ్ర నివేదిక తయారు చేసి దాని ఆధారంగానే పార్టీ మానిఫెస్టోకు రూపకల్పన చేస్తారట.ఈ వ్యవహారంలో జిల్లా స్థాయిలో తొలుతగా 100 మందితో ఏర్పాటయ్యే సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తుందట.జనసేన కార్యకలాపాలు చూస్తుంటే ఇన్నాళ్లు పవన్ రాజాకీయాల్లో సీరియస్ గా వుంటారా అనే సందేహాలకు తెర దించేట్టు వుంది.

Leave a Reply