అనంతను దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్

Posted November 12, 2016

pawan kalyan adopted anantapurఏదైనా గ్రామాన్ని దత్తత తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకి జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ లో స్పందించి నిన్ను వీడిని వాడిని అని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లా , మొత్తం జిల్లా జిల్లా నే దత్తత తీసుకొంటా అని సమాధానం ఇచ్చారు

శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థినీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో పవన్ పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అనంత జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న తపన తనలో ఉందని, స్వతహాగా రైతు కుటుంబ నేపధ్యం ఉన్న వాడినని చెప్పారు .

జిల్లా పరిస్థితులను తెలుసుకోవడానికి పాదయాత్ర చేయాలని ఉందని,కానీ అడుగడుగునా అభిమానం అడ్డంకిగా మారుతుందన్న భయం కూడా ఉందని చెప్పారు. కానీ కనీసం మూడు రోజులైనా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. ‘బద్రి సినిమా చేసేటప్పుడు సౌతాఫ్రికాకు వెళ్తే అక్కడ పొలంలో నుంచి కారు వెళ్తుంటే ఒక్క మొక్క కూడా నాశనం కాకుండా వాహనాలను పోనిచ్చారు. అక్కడ మొక్కకు అంత విలువ ఉంది. ఆ విలువ తెలియకనే అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తోందని .అన్నారు

జానీ సినిమా తర్వాత వాస్తవం బోధపడక కొన్నాళ్లు తోటకు వెళ్లి గడిపా అని కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి రాసిన ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకంలో మన సంపద విదేశాలకు వెళ్లిపోతుందని చెప్పారు’ అని వివరించారు. కరువుపై లక్ష మంది ఆలోచిస్తే పది వేల మంది స్పందిస్తారని,వారిలో మీరెందుకు ఉండకూడదని విద్యార్థులను ప్రశ్నించారు.

SHARE