Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కాటమరాయుడా కదిరి నరసింహుడా అనే పాటను పాడి అలరించిన విషయం తెల్సిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వరద పారించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇప్పటి వరకు కూడా అదే భారీ సినిమాగా నిలిచిన విషయం తెల్సిందే. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది. వరుసగా పరాజయాల పాలైన పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నాడు. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు. దాంతో పవన్ త్రివిక్రమ్‌లు ప్రత్యేక శ్రద్ద చూపించి మరీ ఈ సినిమాను చేస్తున్నారు.
తమ గత చిత్రం ‘అత్తారింటికి దారేది’ సినిమాలో కాటమరాయుడా సాంగ్ తరహాలోనే ఈ సినిమాలో కూడా ఒక బిట్ సాంగ్‌ను పవన్ కళ్యాణ్‌తో పాడివ్వాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందుకోసం ఇప్పటికే పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఒక మంచి ట్యూన్‌ను అందుకోసం సంగీత దర్శకుడు అనిరుథ్ రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కీర్తి సురేష్ మరియు అను ఎమాన్యూల్‌లు నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.