నయన్ ప్రేమలో పవన్….

0
408

Posted [relativedate]

 pawan kalyan am ratnam new movie heroine nayanatara

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి నిర్మాతని మరోసారి ఖుషి చేయబోతున్న విషయం తెలిసిందే. గతంలో.. పవన్-ఎస్ జె సూర్య కలయికలో “ఖుషి” సినిమాని
నిర్మించారు ఎ.ఎం. రత్నం. ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్ తో పాటు నిర్మాతని ఫుల్ ఖుషి చేసింది. అయితే, చాన్నాళ్ల నుంచి మళ్లీ పవన్ తో సినిమా చేయాలనే
ప్రయత్నాల్లో ఉన్నాడు రత్నం. ఆ ప్రయత్నాలు ఈ దసరాకి ఫలించాయి. దసరా రోజున ఎ.ఎం రత్నం నిర్మించేబోయే పవన్ సినిమాకి కొబ్బరికాయ కొట్టిన విషయం
తెలిసిందే.

‘జిల్లా’ ఫేం ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వంలో అజిత్ ‘వేదాలం’ రిమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో పవన్ సరసన నయన తారని హీరోయిన్ గా ఫైనల్
చేసినట్టు సమాచారమ్. పవన్ తో నయన్ ఇప్పటి వరకు జతకట్టలేదు. తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా  ఉన్న నయన్ పవన్ అంటే ఇష్టంతోనే ‘వేదాలం’ తెలుగు రిమేక్ కి ఓకే చెప్పినట్టు సమాచారమ్. ఈ చిత్రంలో నయన్ తో పాటుగా మరో హీరోయిన్ కూడా చాన్స్ ఉందట. మరి.. ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

ప్రస్తుతం పవన్ ‘కాటమరాయుడు’తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ‘వేదాలం’ రిమేక్ ని సెట్స్ పైకి తీసుకురానున్నాడు పవన్. వచ్చేయేడాది జనవరిలో ఈ
చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.

Leave a Reply