Posted [relativedate]
కాటమరాయడు సినిమాతో సోషల్ మీడియాలో ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాడు పవన్. ఈ సినిమా తర్వాత పవన్ త్రివిక్రమ్ తో, ఆ తర్వాత నేసన్ తో సినిమాలను చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత పవన్.. కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడని నిన్న వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ పవన్ కి అడ్వాన్స్ కూడా ఇచ్చారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్… కొరటాల శివ మధ్య బేసిక్ లెవల్ లో స్టొరీ డిస్కషన్స్ జరిగాయని చెబుతున్నారు.
ప్రస్తుతం మహేష్ తో సినిమా చేసేందుకు సిద్దం అవుతున్న కొరటాల శివ, ఆ సినిమా పూర్తయిన తర్వాత పవన్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ గ్యాప్ లో పవన్ కూడా త్రివిక్రమ్, నేసన్ దర్శకత్వంలో సినిమాలని పూర్తి చేయనున్నాడట. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తరహాలోనే ఓ సందేశాన్నిచ్చేలా పవన్-కొరటాల సినిమా కూడా ఉండబోతోందని సమాచారం. అలానే పవన్ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేలా సినిమాలో అతని క్యారెక్టరైజేషన్ ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా 2019లో పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఖాయం. అలాంటప్పుడు సినిమాల ద్వారా రాజకీయ పబ్లిసిటీలు దేనికని కొందరు విమర్శకులు అంటున్నారు.