Posted [relativedate]
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమా పనులు జోరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గోపాల గోపాల చిత్రానికి దర్శకత్వం వహించిన డాలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించిన వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
కాటమరాయుడులో ప్రిన్స్ మహేష్ బాబు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నాడని ఆ వార్తల సారాంశం. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్… ఇప్పడు ఏకంగా పవన్ సినిమాలో గెస్ట్ రోల్లో నటిస్తున్నాడని సమాచారం. దీనిపై భిన్న వాదాలు వినిపిస్తున్నాయి. అప్పట్లో వరుస ఫ్లాఫ్ లలో ఉన్న పవన్ కి జల్సా సినిమాలో మహేష్ వాయస్ ప్లస్ అయ్యిందని, అందుకే ఆ సినిమాతో తిరిగి క్రేజ్ ను సంపాదించుకున్నాడని, మళ్లీ తిరిగి అదే స్ట్రాటజీతో మహేష్ చేత నటింపజేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం పవన్… మహేష్ తో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడని, ఆడియన్స్ మైండ్ సెట్ తెలుసుకునేందుకే తన సినిమాలో మహేష్ చేత నటింపచేస్తున్నాడని గుసగుసలాడుతున్నారు. మరి ఎవరి ఆలోచన కరెక్టో తెలియాలంటే మరి కొంతకాలం వెయట్ చెయ్యక తప్పదు.