Posted [relativedate]
నిజమే బాక్సాఫీస్ వార్ కి సై అంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. వారెవరో కాదు ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ నందమూరి హీరో, మెగా కాంపౌండ్ హీరో బాక్సాఫీస్ వద్ద తలపడేందుకు బరిలో దిగుతున్నారు.
మార్చి 24న రిలీజ్ కానున్న కాటమరాయుడు సినిమా తర్వాత పవన్… త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించననున్నడన్న విషయం తెలిసిందే. ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లని ఈ చిత్రాన్ని ఆగష్టు11న రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. కాగా అదే రోజున ఎన్టీఆర్ చేస్తున్న జై లవకుశ సినిమా కూడా రిలీజ్ కానుందని నందమూరి సన్నిహితులు చెబుతున్నారు. ఆగస్టు రెండో వారం నుంచి సెలవులు ఎక్కువగా వస్తుండడంతో.. ఆగస్టు 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని కల్యాణ్ రామ్ భావిస్తున్నాడట. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే పవన్.. త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల ఎంత సెన్సేషన్ ని క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజంటే ఫ్యాన్స్ కి మాత్రం పండగే. మరి చూద్దాం బాక్సాఫీస్ బరిలో ఎవరు గెలుస్తారో…