Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా ఆయన 101వ చిత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘పైసా వసూల్’ అనే టైటిల్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్ సభ్యులు ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌ను కూడా విడుదల చేయడం జరిగింది. అలాగే రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్‌ను కూడా ‘రంగస్థలం 1985’ అంటూ ప్రకటించారు. ఆ రెండు చిత్రాల టైటిల్స్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అరించేలా త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తన స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే 150 కోట్ల బిజినెస్ నిర్మాత ముందుకు వచ్చింది. అంతటి క్రేజ్ ఉన్న సినిమాకు ఏ టైటిల్‌ను నిర్ణయిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం టైటిల్‌ను మరియు ఫస్ట్‌లుక్‌ను రివీల్ చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు ఇటీవలే ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు.