Posted [relativedate]
పవన్ కళ్యాణ్… ఈ పేరు చెప్పగానే పవన్ అభిమానులు కాలర్ ఎగురవేస్తారు.. కాటమ రాయుడు మూవీ రిలీజ్ అయిన వారం రోజుల లోనే పవన్ కళ్యాణ్ కొత్త మూవీ కూడా పట్టలెక్కించాడు. పవన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొదట దేవుడే దిగి వచ్చినా మూవీ టైటిల్ అని ప్రచారం జరిగింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ 25 మూవీ ‘‘ఇంజనీర్ బాబు” ట్యాగ్ లైన్ ‘ఇంటి పేరు – ఒంటి పేరు అంతా ఇదే…’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పవన్ ఇందులో కనిపించనున్నాడు, అందువలన ఈ సినిమాకు ఇంజనీర్ బాబు అయితే బాగుంటుంది అని ఇలా ఫిక్స్ చేసారు అని సమాచారం.. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే రామోజీఫిల్మ్ సిటీలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. రామోజీఫిల్మ్ సిటీలో వేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ సెట్ లో షూటింగ్ స్పీడ్ గా వెళ్ళిపోతోంది.. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌ల తరువాత వీరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా సిద్ధమవుతున్న ఈ సినిమాను ఈ ఏడాది లోనే విడుదల చేయనున్నారు.
పవన్ నటించిన తాజా చిత్రం కాటమరాయుడు ఒక్కరోజులోనే తేలిపోవడంతో.. ఈ సినిమా పై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్టు ఉంది. అందుకే సోషల్‌మీడియాలో లైక్‌లు కొడుతూనే ఉన్నారు.