ప‌వ‌న్ క‌లం నుంచి మ‌రో పుస్త‌కం?

Posted February 2, 2017

pawan kalyan authoring another book
జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్…. ఎంతో ప‌రిశోధించి ఇజం అనే పుస్త‌కం రాశారు. జ‌న‌సేన‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఎంతో ఆశించారు. కానీ ఆ ఆశ‌ల‌న్నీ అడియాస‌లుగానే మిగిలిపోయాయి. బుక్ ఇంగ్లీష్ లో ఉండ‌డంతో అది అంత‌గా ఎక్క‌లేదు. కొద్దికాలం త‌ర్వాత తెలుగులో అందుబాటులోకి వ‌చ్చినా…అప్ప‌టికే ఆ బుక్ పై ఉన్న హైప్ త‌గ్గిపోయింది. కొంత‌మంది దాన్ని చ‌ధివినా అర్థం కాలేద‌ట‌. సోష‌లిజానికి సంబంధించిన పదాలుండ‌డంతో అర్థం చేసుకోవ‌డం క‌ష్ట‌మైంది. ఈ విష‌యాన్ని ఎవ‌రూ ప‌వ‌న్ దాకా తీసుకెళ్ల‌లేదు. కానీ జ‌న‌సేనానికి అత్యంత ఆప్తుడుగా పేరున్న డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ పుస్త‌కంలోని లోపాల గురించి చెప్పార‌ట‌. వాడుక భాష‌ను వాడాల్సిందని అన్నార‌ట‌. అంతేకాదు ప్ర‌స్తుతం హోదా పోరు ర‌గులుతున్న త‌రుణంలో ఆ అంశ‌మే ఇతివృత్తింగా మ‌రో పుస్త‌కం రాస్తే బావుటుంద‌ని సూచించారట‌.

త్రివిక్ర‌మ్ స‌ల‌హాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో పుస్త‌కం రాసే ప‌నిలో ఉన్నార‌ని టాక్. గ‌త పుస్త‌కం తాలూకు అనుభ‌వాల‌తో ఈసారి వాడుక‌భాష‌నే బుక్ లో రాస్తార‌ట‌. ఇక హోదా అంశ‌మే ఇతివృత్తంగా ఇందులో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించే అవ‌కాశ‌ముంది. ముఖ్యంగా బీజేపీ టార్గెట్ గా ఈ పుస్త‌కం ఉంటుంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప‌వ‌న్ బుక్ రాయ‌డానికి ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని స‌న్నిహితులు కూడా చెబుతున్నార‌ట‌. దీంతో సినిమాల‌కు కొంచెం టైమ్ త‌గ్గించుకొని అయినా స‌రే… పుస్త‌కం రాయాల‌ని ప‌వ‌న్ స్టార్ అనుకుంటున్నారని టాక్. ఇప్ప‌టికే ఆదిశ‌గా గ్రౌండ్ వ‌ర్క్ పూర్త‌య్యింద‌ని స‌మాచారం. ఏడాదిలోపే ఈ పుస్త‌కాన్ని పూర్తి చేసి… రిలీజ్ చేయాల‌ని జ‌న‌సేనాని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. ఈ కొత్త బుక్ లో త్రివిక్ర‌మ్ మార్క్ పంచ్ డైలాగులు క‌నిపించే అవ‌కాశం ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది.

SHARE