Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు చేసిన వ్యాఖ్య ఆయన్ను కామెడీ పాలు చేసినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ సందర్భం సరైనది అయినప్పటికీ…పోలికే పవన్‌ను ఇరకాటంలో పడేసింది. ఇంతకూ పవన్ చెప్పింది ఏంటి అంటే ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కున్నది అల్బర్ట్ ఐన్ స్టీన్ అట.
ఇటీవల జనసేన పార్టీ నేతలతో సమావేశం అవుతూ వస్తున్న పవన్ కల్యాణ్ తాజాగా తన భేటీలో అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఐన్ స్టీన్ ఎలక్ట్రిక్ బల్బ్‌ను కనుక్కున్నట్లు చెప్పారు. అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే..ఆయన ప్రసంగానికి అభిమానులు సైతం చప్పట్లు కొట్టారు. పుస్తక పరిజ్ఞానం విశేష జ్ఞానం ఉన్న పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్య కలిగించే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
మరోవైపు పవన్ ఐస్ స్టీన్ కామెంట్లపై సోషల్ మీడియాలో పంచ్‌లు జోకులు వేస్తున్నారు. గతంలో పాపులర్ అయిన బీకాంలో ఫిజిక్స్ ఎమ్మెల్యే జోకుతో లింకు పెట్టేసి పవన్ పై సెటైర్లు వేస్తున్నాయి. అయితే దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం అదే రీతిలో స్పందిస్తూ గతంలో పవన్ పలు సందర్భాల్లో ఐన్ స్టీన్ ఎడిసన్ గురించి చేసిన వీడియో పోస్ట్‌లను అప్ లోడ్ చేస్తున్నారు.