Posted [relativedate]
ఇప్పుడంతా బయోపిక్ ల కాలం నడుస్తోంది. బాలీవుడ్ లో మరీనూ.ఇప్పడీ ట్రెండు టాలీవుడ్ కి తాకింది. వరుస బయోపిక్ లకి రంగం సిద్ధమవుతోంది. బ్యాడ్మెంటన్ క్రీడాకారుడు, కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కి రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి ‘కేసీఆర్ బయోపిక్’ పై ప్రకటన కూడా వెలువడింది. మధుర శ్రీధర్ రెడ్డి కేసీఆర్ పై సినిమా ప్లాన్ చేశాడు. ఇంతలోనే కేసీఆర్ బయోపిక్ ని ‘ఆర్ సీకే’ పేరుతో తెరకెక్కిస్తానంటూ రాంగోపాల్ వర్మ కూడా రంగంలోకి దిగాడు.
అయితే, తాజా సమాచారమ్ ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయంట. పవన్ సినీ స్టార్ మాత్రమే కాదు. ఏపీ రాజకీయాలని ప్రభావం చేసిన, చేస్తోన్న యువనేత. ‘జనసేన’ అధ్యక్షుడు.అలాగని పవన్ వ్యక్తిత్వం పొలిటికల్ లీడర్ ని ఏ మాత్రం పోలివుండదు. ఓ సాధారణ మానవుడులా ఉంటాడు. అలాంటి పవన్ జీవితం.. ఓ సినిమాకి కావాల్సిన అన్ని సరకులు దొరకుతాయి. ఈ నేపథ్యంలో పవన్ సన్నిహితుడు ఒకరు.. పవన్ బయోపిక్ ని రాస్తున్నాడంట. ఇప్పటికే పవన్ తో చర్చించాడట.
మొత్తానికి.. త్వరలోనే పవన్ జీవితగాథని వెండితెరపై చూడటం ఖాయమంటున్నారు.ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే మరి.పవన్ సినిమాలో ఆయన ఫ్యాన్స్ ది కూడా కీలక పాత్ర ఉండబోతుందట. అదేలాగా.. ? అనేది పవన్ సినిమాలో చూడాలి. అన్నట్టు.. టైటిల్ ‘పవన్ స్టార్’ పెడతారేమో !