పవర్ స్టార్ తో లక్కీ ఛాన్స్..!

0
232
Pawan Kalyan Call For Akhil Heroine Sayesha Saigal

Posted [relativedate]

Pawan Kalyan Call For Akhil Heroine Sayesha Saigalపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని ఏ హీరోయిన్ కు ఉండదు చెప్పండి. పవన్ సినిమాలో ఛాన్స్ అంటే ఇక దాదాపు ఆమెకు స్టార్ క్రేజ్ వచ్చేసినట్టే అయితే అలాంటి అవకాశం కేవలం తెలుగులో ఒక్క సినిమా చేసిన హీరోయిన్ కు ఇస్తున్నారు. బాలీవుడ్ నుండి వచ్చిన సయేషా సైగల్ తెలుగులో అక్కినేని అఖిల్ సరసన అఖిల్ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇక్కడ అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసిన అమ్మడు అజయ్ దేవగన్ తో శివాయ్ సినిమాలో నటించింది.

లక్కీగా సయేషా సైగల్ కు పవర్ స్టార్ తో నటించే అవకాశం వచ్చింది. సెట్స్ మీద ఉన్న కాటమరాయుడు కాకుండా త్రివిక్రం, నీశన్ డైరక్టర్స్ తో రెండు సినిమాలను చేస్తున్న పవన్ జనవరి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే త్రివిక్రం సినిమాలో కీర్తి సురేష్, అను ఇమాన్యుయెల్ హీరోయిన్ గా సెలెక్ట్ అవగా నీశన్ డైరక్షన్ లో మూవీకి సయేషా సైగల్ ను ఫైనల్ చేశారట. అఖిల్ సినిమాలో అందాల మత్తు చల్లిన సయేషా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవడంతో వేరే సినిమా అవకాశాలు రాలేదు. మరి రాక రాక వచ్చిన ఈ ఛాన్స్ ను అమ్మడు ఎలా వాడుకుంటుందో చూడాలి.

Leave a Reply