బాబు,పవన్ డ్యూయెట్ ..ఎవరిదో ఈ డౌట్?

 Posted October 17, 2016

pawan kalyan chandrababu between chemistry
పశ్చిమ గోదావరి జిల్లాలో తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం మరోసారి బాబు,పవన్. ప్రియరాగాలు పాడుకుంటున్న విషయాన్ని బయటపెట్టిందని వైసీపీ ఆరోపిస్తోంది.సమస్య మీద ఏ రాజకీయ పక్షమైనా పోరాడుతుంది .కానీ భాదితులు వచ్చి మొరపెట్టుకోవడం..దానిపై జనసేన అధినేత స్పందించడం..ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం…సీఎం ఓ అధికారిక సమావేశం ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పడం..ఇబ్బంది కలగబోదని ప్రజలకి హామీ ఇవ్వడం…ఇదంతా భీమవరం సమీపంలో తలపెట్టిన మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యవహారంలో చెకచెకా సాగిన పరిణామాలు.

రెండు పార్టీలు …అందులో ఒకటి అధికార పక్షం ఉండగా ఇంత సున్నితంగా వ్యవరించడం ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు.కానీ బాబు,పవన్ ల మధ్య కెమిస్ట్రీ అదిరిపోతోంది.సోలో సాంగ్ వేయాల్సినపుడు కూడా డ్యూయెట్ తో సీన్ రక్తి కట్టిస్తున్నారు.దీంతో ఈ అంశంపై పోరాడ తలపెట్టిన వైసీపీ ఇద్దరిపై మండి పడుతోంది.ఎక్కడ సమస్య వున్నా బాబు,పవన్ కూడబలుక్కొని తమకి స్థానం లేకుండా చేస్తున్నారని వైసీపీ డౌట్.కానీ డౌట్ పడాల్సిన పనే లేదు.అది నిజమేనని కళ్ళెదురుగా కనిపిస్తోంది.కౌంటర్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం తప్ప వైసీపీ కి మరో ఛాన్స్ లేదు .ఇది రాజకీయం..ఇక్కడ గెలుపు ఓటమి తప్ప నియమ నిబంధనలు వుండవు.

SHARE