“మిరమిర మీసం” తిప్పూతూనే మరో రికార్డు

0
337
pawan kalyan create new record with mira mira meesam song in katamarayudu

Posted [relativedate]

pawan kalyan create new record with mira mira meesam song in katamarayuduపవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతాకాదు. ఒకప్పుడు వరసు ఫ్లాపులతో సతమతమైన పవన్ గబ్బర్ సింగ్ సినిమా తర్వాత రూటు మార్చాడు. ఆ తర్వాత అన్నీ దాదాపు హిట్స్ నే అందుకున్న పవన్ మేనియా ప్రస్తుతం మాములుగా లేదు. అతను ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. అటు పాలిటిక్స్ లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. ఇటీవల విడుదలైన కాటమరాయుడు టీజర్… కేవలం రెండే గంటల్లో 1 మిలియన్ వ్యూస్ ని రాబట్టి, అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డును క్రియేట్ చేశాడు కాటమరాయడు.

నిన్న సాయంత్రం కాటమరాయుడు టైటిల్ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. మిర మిర మీసం తిప్పుతాడు జనం కోసం…  అంటూ సాగిన ఆ పాట అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా ఈ పాట మరో రికార్డును క్రియేట్ చేసింది. విడుదల చేసిన 50 నిమిషాల్లోనే  3 లక్షల వ్యూస్ ను ఈ పాట సాధించింది. ఇలా తన పవనిజంతో తన రికార్డులను తానే బద్దలు కొడుతూ  సాగుతున్నాడు మన పవర్ స్టార్. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తాడో.. వాటిని ఇంకెన్ని సార్లు బద్దలు కొడతాడో చూడాలి.  

Leave a Reply