జగన్ ని డైవర్ట్ చేస్తున్న పవన్ ?

Posted [relativedate]

pawan kalyan divert to jagan attitude
బతికుంటే బలుసాకు అయినా తిని బతకొచ్చు….ఎప్పటినుంచో జనం నోళ్ళలో తెగనానిపోయిన ఈ నానుడికి అర్ధం ఏమిటంటే…గొప్పగా కాకపోయినా ముందుగా అసలు బతికంటూ ఉంటే ఏదోవిధంగా బతకొచ్చని ..వైసీపీ అధినేత జగన్ విషయంలో ఈ నానుడిని నిజం చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.ప్రతిపక్ష నేతగా వున్న జగన్ చూపు అధికారం మీద ఉందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ టార్గెట్ రీచ్ కావడానికి జగన్ తనకు తెలిసిన దారిలో ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు లేకపోయినా జగన్ ని డైవర్ట్ చేసేందుకు టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.అందుకోసం జనసేన అధినేత పవన్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.అదెలాగంటే …

ప్రతిపక్ష నేతగా సక్సెస్,ఫెయిల్యూర్ పక్కనబెడితే జగన్ వ్యవహారశైలి దూకుడుగానే ఉంటోంది. మొన్న విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసులతో..ఇప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ తో జగన్ ఎలా డీల్ చేసాడో చూస్తే ఆయన దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.ఈ స్పీడ్ కి భిన్నంగా పవన్ వ్యవహరిస్తున్నారు.ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నా ఆ టోన్ లో మూలాల మీద ఫోకస్ ఉంటుందే తప్ప పొలిటికల్ టార్గెట్ తక్కువగా ఉంటుంది.అందుకే టీడీపీ సర్కార్ వెంటనే ఓ అనుకూల ప్రకటన ఇచ్చేసి పవన్ ని శాంతిపచేయడమే కాదు …ఆయన ప్రతిపక్ష నేతగా బాగా పనికొస్తాడని ప్రొజెక్ట్ చేస్తోంది.ఆ పార్టీ ఇలా చేయడం కొత్త కాకపోయినా తాజాగా సోమిరెడ్డి మరోసారి ఆ కోణం బయటికొచ్చింది.నీ కన్నా పవన్ పనితీరు బాగుందని జగన్ ని ఉద్దేశిస్తూ సోమిరెడ్డి చెప్పడం తో జగన్ టార్గెట్ మారుతుందని,ఆయన డైవర్ట్ అవుతారని టీడీపీ ఆలోచన.అప్పుడు మనం పైన చెప్పుకున్నట్టు అసలుకే ఎసరొస్తే అధికార పగ్గాల విషయం పక్కనబెట్టి ప్రతిపక్ష నేత బాధ్యత కాపాడుకోడానికి జగన్ ట్రై చెస్తాడని టీడీపీ వ్యూహం.నిజంగా పవన్ భయంతో ఆ వ్యూహంలో జగన్ చిక్కుకుంటాడో లేక ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ రన్ చేస్తారో చూద్దాం..

Leave a Reply