Posted [relativedate]
పవన్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా రిలీజ్ డేట్ డిసైడ్ అయ్యింది.అదే ఆగష్టు 11 . వీకెండ్ తో పాటు ఇండిపెండెన్స్ డే సెలవు ఉండటంతో ఈ డేట్ కి ఎలాగైనా సినిమా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్ పట్టుదలగా వున్నాడు.అంటే జులై కల్లా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.మూడునెలల్లో పవన్ తో సినిమా తీయడం అంత ఈజీ కాదు.అయితే అందుకోసం ఓ ప్లాన్ అమలుజేస్తున్నాడు త్రివిక్రమ్.అదేంటో తెలుసా ? పవన్ తో రోజుకి 12 గంటలు పని చేయించడం.మాములు కాల్ షీట్ కి చేసే పనికన్నా ఇక్కడ పని గంటలు చాలా పెరుగుతుతాయి.దీనికోసం పవన్ కి పే మెంట్ కూడా పెంచుతున్నారట.ఇది కూడా దర్శకుడి పనేనా అని ఆలోచించకండి.
ఈ సినిమా తీస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ త్రివిక్రమ్ కి సొంత బ్యానర్ లాంటిది. అంత కన్నా ముఖ్య విషయం ఏమిటంటే ఈ సినిమాకి ఓ బడ్జెట్ అనుకుని ఆ మొత్తంలో సినిమా చేసేలా త్రివిక్రమ్ తో ఒప్పందం కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది.అందుకే రెండు వైపులా ఆలోచించి పనికి పని ,బడ్జెట్ కి బడ్జెట్ అనేలా త్రివిక్రమ్ పవన్ తో ఓటీ చేయించే సాహసం చేస్తున్నాడు. అడిగింది సన్నిహితుడు,స్నేహితుడు కాబట్టి కొన్ని నెలల పాటు రోజుకి 12 గంటలు కష్టపడేందుకు పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.