పవన్ అభిమాని తల్లి చంద్రబాబుని ఏమడిగారు?

0
521

 pawan kalyan fan vinod mother asking chandrababu what
కోలార్ ఘటన లో చనిపోయిన పవన్ అభిమాని వినోద్ తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారా? కలిస్తే ఆయన్ని ఏమడిగారు? వినోద్ తల్లి బాబు ని కలిసిన మాట నిజం.ఈ విషయాన్ని ఆమె స్వయంగా మీడియాతో మాట్లాడినప్పుడు చెప్పారు.అయితే ఇదంతా వినోద్ హత్యకి ముందు జరిగిన వ్యవహారం….
వినోద్ కుటుంబం స్థానిక రాజకీయాల్లో చురుగ్గానే పాల్గొనేది.

ఒకప్పుడు ప్రజారాజ్యంలో వినోద్ తల్లి క్రియాశీలకంగా వ్యవహరించారు.తర్వాత పరిస్థితుల్లో రాజకీయ దారి మార్చుకున్నారు.అయితే కాపు సంఘాల్లో ఆమె చిన్న చిన్న పదవుల్లో కూడా వున్నారు .ఇటీవల సీఎం ని కలిసిన ఓ బృందం సభ్యురాలిగా కాపులకి రిజర్వేషన్ కల్పించమని వినోద్ తల్లి కోరారు.అందుకు స్పందించిన చంద్రబాబు అందుకోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారని ఆమె తెలిపారు.అయితే రాజకీయంగా ,వ్యక్తిగతంగా తమ కుటుంబానికి ఎవరితో స్పర్ధలు లేవని ఆమె చెప్పారు.

Leave a Reply