అల్లు అర్జున్ కి పవన్ ఫాన్స్ షాక్..

100

  Posted [relativedate]

pawan kalyan fans attack on allu arjun at khaidi no 150 movie pre release function
మెగా ఫాన్స్ అత్యుత్సాహం ఆ కుటుంబ సభ్యుల మధ్య అంతకంతకీ గ్యాప్ పెంచుతోంది. ఖైదీ నెంబర్ 150 వేడుకలో వేదిక మీద నాగబాబు ఫైర్ అవ్వడం అందరూ చూశారు. కానీ వేదిక కింద అంతకు మించిన ఎపిసోడ్ రన్ అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ దాదాపుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని చుట్టుముట్టేశారు.పవన్ కి జిందాబాద్ లు కొడుతూ అయన పేరు చెప్పమని అర్జున్ మీద ఒత్తిడి చేశారు.అయితే అర్జున్ నవ్వుతూ చూస్తుండిపోయారు తప్ప వారికి బదులివ్వలేదు.పవన్ ఫాన్స్ కూడా అయన ముందుకి వెళ్లకుండా ఓ దడి కట్టేశారు.చివరకు పోలీసుల జోక్యంతో అల్లు అర్జున్ ఆ చిక్కుముడి నుంచి బయటపడ్డారు.

ఈ మొత్తం వ్యవహారం ఎవరో షూట్ చేసి యూట్యూబ్ లోకి ఎక్కించారు.ఇప్పుడు సోషల్ మీడియా లో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది.మొత్తానికి పవర్ స్టార్ ఫాన్స్ వైఖరితో మెగా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కాస్తా పెద్దవి అవుతున్నాయి.ఇంతకుముందే ఓ సారి పవన్ మీద కామెంట్ చేసిన అర్జున్ ఈ ఎపిసోడ్ మీద ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

[wpdevart_youtube]FlxBX0E6K4Y[/wpdevart_youtube]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here