జగన్ చెప్పుల్లో పవన్ కాళ్లు?

0
1393
pawan kalyan follow to jagan

 Posted [relativedate]

pawan kalyan follow to jagan
ప్రతిపక్షం నుంచి అధికారపక్షానికి ఎదగడానికి వైసీపీ అధినేత జగన్ ప్రయత్నిస్తుంటే..అయన ప్రతిపక్ష స్థానానికే ఎసరుపెట్టే పనులు చేస్తున్నాడు జనసేనాధిపతి పవన్. యువభేరి పేరిట యువతలో ప్రత్యేక హోదా అంశంపై అవగాహన పెంచేందుకు జగన్ వివిధ కాలేజీల్లో సభలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ సైతం అదే బాటలో నడవబోతున్నారు. ఈనెల 10 న అనంతపురం సభకి వెళ్తున్న పవన్ తర్వాత రోజు అదే జిల్లా గుత్తిలో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో సమావేశమవుతారు.విద్యార్థులతో పవన్ ముఖాముఖీ మాట్లాడుతారు.వారు అడిగే ప్రశ్నలకి జవాబిస్తారు. ఇదంతా చూస్తుంటే జగన్ చెప్పుల్లో పవన్ కాళ్ళు పెడుతున్నట్టుందని వైసీపీ వర్గాలు లోలోన గొణుక్కుంటున్నాయి.

Leave a Reply