మీడియా పెద్దలతో పవన్ కల్యాణ్ దోస్తానా..?

Posted December 5, 2016

pawan kalyan friendship with media channel owners
పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. హిట్లు, ఫట్లతో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి వ్యక్తి పార్టీ పెడితే మీడియా హైప్ ఓ రేంజ్ లో ఉండడం కామన్. కానీ పవన్ విషయంలో అలా జరగడం లేదు. జనసేన విషయంలో రాను రాను మీడియా ఫోకస్ తగ్గించిందని పవన్ భావిస్తున్నారట.

పవన్ ఆ మధ్య తిరుపతి సభను నిర్వహించారు. దానికి మీడియా బాగానే ప్రచారం కల్పించింది. కానీ ఆ తర్వాత జరిగిన రాజమండ్రి సభకు ప్రయారిటీ తగ్గించేసింది. అనంతపురం మీటింగ్ కు వచ్చేసరికి పరిస్థితి మారింది. మీడియాలో పెద్దగా ఈ సభకు కవరేజ్ రాలేదు.

ఇన్నాళ్లూ మీడియా విషయంలో చూసీచూడనట్టున్న పవన్ ఇప్పుడు మనసు మార్చుకున్నారట. ప్రస్తుతం తరచూ ఛానల్స్ ను ఫాలో అవుతున్నారని సమాచారం. జనసేనకు ఏ ఛానల్ లో ఎంత కవరేజ్ ఉంది? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. మీడియాతో ఈ దూరాన్ని తగ్గించేందుకు.. మీడియా పెద్దలతో క్లోజ్ గా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కొన్ని ఛానల్స్ తో ఆయన రిలేషన్ బాగా క్లోజ్ అయిందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే మిగతా వారితోనూ ఆయన క్లోజ్ అవుతారని టాక్. అయితే ఈ సాన్నిహిత్యంతోనైనా జనసేనకు కవరేజ్ లభిస్తుందో.. లేదో చూడాలి.

SHARE