ఆ ఇద్దరికీ పవన్ టైం ఇస్తాడా?

    pawan kalyan giving chance meet somu veerraju sujana chowdary
కాకినాడ సభ తరువాత పవన్ ఏమి చేస్తున్నాడు? కాటమరాయుడు సినిమా కోసం కసరత్తులు ఓ వైపు..జనసేన సిద్ధాంతాల్ని వివరించే పుస్తకం పనులు మరోవైపు…ఇవీ అయన గురించి బయటకి వస్తున్న వార్తలు.అయితే ప్యాకేజ్ వల్లే హోదా కన్నా రాష్ట్రానికి మేలెక్కువ జరుగుతుందని బీజేపీ ప్రచారం ఉద్ధృతమైంది.టీడీపీ కూడా కమలనాథులకు వంత పాడుతోంది.ఈ పరిస్థితుల్లో పవన్ మౌనం వహించడం జనసేన వర్గాల్ని అయోమయంలో పడేస్తోంది.ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి తదుపరి పనుల్లో నిమగ్నమైతే బాగుంటుందని ఆ వర్గాలు అనుకుంటున్నాయి.

అయితే బీజేపీ,టీడీపీ ల ఆలోచన మరోవిధంగా వుంది.2014 ఎన్నికల్లో తమ విజయానికి పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా ఉపయోగపడిందని భావిస్తున్న ఆ పార్టీలు ఆయన్ను వదులుకోగూడదని అనుకుంటున్నాయి.అయితే అందుకోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన పని లేదని ఆ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.ఓ ప్రయత్నంగా ప్యాకేజ్ ప్రయోజనాల్ని పవన్ కి వివరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.ఆ పని చేస్తామని ఇంతకుముందే కేంద్రమంత్రి,టీడీపీ నేత సుజనా చౌదరి,కమలం నేత సోము వీర్రాజు ప్రకటించారు.ఇప్పుడు ఆ పార్టీలు అధికారికంగా వారినే పవన్ వద్దకి దూతలుగా పంపాలనుకుంటున్నాయి.కానీ ఆ ఇద్దరికీ పవన్ టైం ఇస్తారా?లేదా ?…దీనిపై క్లారిటీ వస్తే పవన్ భవిష్యత్ వ్యూహం అర్ధమైపోతుంది.

SHARE