గో బ్యాక్ హిందీ అంటున్న పవన్

0
564
pawan kalyan go back hindi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

pawan kalyan go back hindiపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఉత్తరాది అహంకారంపై గళమెత్తారు. ఎన్డీఏ సర్కారు చాపకింద నీరులా ఇందిరాగాంధీ విధానాలు అనుసరిస్తోందన్న విమర్శలు వస్తున్న తరుణంలో.. జనసేనాని స్పందన చర్చనీయాంశమైంది. గో బ్యాక్ హిందీ పేరుతో పత్రికల్లో ప్రచురితమైన కథనాన్ని ట్విటర్లో పోస్ట్ చేసిన పవన్.. ఇలాంటి విధానాలు తీసుకొస్తే.. ప్రత్యేక ఉద్యమాలు పుట్టుకొస్తాయని కేంద్రాన్ని హెచ్చరించారు. దీంతో జనసేన క్యాడర్, పవన్ అభిమానులు కూడా కేంద్రంపై ఆగ్రహంగా ఉన్నారు.

ఇప్పటికే తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ హిందీ గో బ్యాక్ అంటూ నినదించారు. ఆయన బాటలో పవన్ నడవడంతో మరిన్ని రాష్ట్రాల్లో ఈ నినాదం ఎత్తుకునే అవకాశం కనిపిస్తోంది. నిజానికి దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే భాషా ఉద్యమాలు జరిగాయి. అసలు జాతీయ భాషగా హిందీ ఉండాలా, ఇంగ్లీష్ ఉండాలా అని పార్లమెంట్ లో ఓటింగ్ కూడా జరిగింది. అయితే కేవలం ఒక్క ఓటు తేడాతో హిందీ జాతీయ భాష హోదా పొందింది. నిజానికి ఇంగ్లీష్ నేషనల్ లాంగ్వేజ్ అయితే తమకు ఉపయోగమని దక్షిణాది రాష్ట్రాలు భావించాయి.

కానీ ఉత్తరాది మెజార్టీతో ఆ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు కూడా అదే ఉత్తరాది అహంకారంతో హిందీని దేశంపై రుద్దాలని చూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శల్ని కేంద్రం కొట్టిపారేసింది. దేశంలో ఎప్పట్నుంచో త్రిభాషా సూత్రం అమలౌతోందని గుర్తుచేసింది. మాతృభాష, దేశ భాష, ప్రపంచ భాష అన్నీ నేర్చుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. జాతీయ భాష నేర్చుకుంటే మంచిదని, కానీ తామెవరిమీదా బలవంతంగా రుద్దడం లేదని స్పష్టం చేసింది. అనవసర అపోహలతో లేనిపోని విమర్శలు చేయొద్దని సూచించింది.

pawan kalyan go back hindi

Leave a Reply