పవన్‌ హీరోయిన్‌కు ఇంకా ఆశ చావట్లేదా?

Posted April 17, 2017

pawan kalyan heroine nikesha patel new hot photoshoot for movie chances
పవన్‌ కళ్యాణ్‌, ఎస్‌జే సూర్యల కాంబినేషన్‌లో వచ్చిన ‘కొమురం పులి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నికీషా పటేల్‌. ఆ సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అవ్వడంతో నికిషా ఎంత గ్లామర్‌గా కనిపించినా ఫలితం లేకుండా పోయింది. తెలుగులో ఈమె అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ, తమిళం, కన్నడంలో కూడా చిన్న చిన్న సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా తెలుగులో ‘అరకు రోడ్డులో’ అనే చిత్రాన్ని ఈమె చేసింది. ఆ సినిమా కూడా ఈమెకు ఏమాత్రం గుర్తింపు తీసుకు రాలేక పోయింది. దాంతో ఈ అమ్మడి కెరీర్‌ ఖతం అయినట్లే అని అంతా అనుకుంటున్నారు.

ఈ సమయంలోనే ఈ అమ్మడు ఇంకా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన అందం ఏమాత్రం తగ్గలేదని, మంచి అవకాశం వస్తే తప్పకుండా తన సత్తా ఏంటో చూపిస్తాను అంటూ సన్నిహితులతో చెబుతూ వస్తుంది. ఇక అప్పుడప్పుడు హాట్‌ హాట్‌ ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేస్తూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఈ ఫొటోను విడుదల చేసిన నికీషా పటేల్‌ అందరి దృష్టిని ఆకర్షిచింది. మరీ ఇంత హాట్‌గా ఇప్పటి వరకు ఈమె ఎప్పుడు కనిపించింది లేదు. ఈసారి కాస్త డోస్‌ పెంచడంతో హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఇప్పటికి అయినా ఈమెకు హీరోయిన్‌ కాకున్నా కనీసం ఐటెం అవకాశాలైనా వస్తాయేమో చూడాలి.

SHARE