పుండు మీద కారం జల్లిన పవన్!!!

0
378
pawan kalyan Hunger strike for arrested students

Posted [relativedate]

pawan kalyan Hunger strike for arrested students
ఏదైనా సమస్యపై పోరాటం చేయాలన్నా… ఉద్యమాన్ని నడపాలన్నా దానికి సమయం, సందర్భం ఉంటాయి. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎన్ని ఉద్యమాలు చేసినా లాభం ఉండదు. ప్రత్యేక హోదా విషయంలోనూ అంతే. హోదాపై కేంద్రం ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసింది. అయితే జల్లికట్టు నేపథ్యంలో హోదాపోరుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది అందరికీ అర్థమైంది కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అర్థం కాలేదు.

ప్రత్యేక హోదాపై వైజాగ్ ఆర్కే బీచ్ వేదికగా కుమ్మేద్దాం, కేంద్రాన్ని నిలదీద్దాం.. అని చెప్పిన పవన్ తీరా టైమ్ కు మొహం చాటేశారు. ఆందోళన చేయాలని యువతకు సలహా ఇచ్చి… తాను మాత్రం ఎంచక్కా షూటింగ్ కానిచ్చేశారు. అంటే యుద్ధం సమయానికి మొహం చాటేశారన్నమాట. ఇటు కొందరు యువత ఈయన మాటలు విని.. వైజాగ్ లో ఆందోళన చేయడానికి వచ్చారు. అరెస్టయ్యారు. ఇప్పుడు కేసులను ఎదుర్కొంటున్నారు. సారు మాత్రం షూటింగులు చేసుకుంటూ… ట్వీట్లతో సరిపెట్టారు. అందుకే పవన్ పై విమర్శల జడివాన కురుస్తోంది.

అసలే జగన్ ఆర్కే బీచ్ లో హోదా ఉద్యమానికి రాలేదని విమర్శలు కురుస్తుంటే.. పుండు మీద కారం చల్లినట్టుగా మరో ప్రకటన చేశారాయన. మార్చినెలలో దిక్షకు దిగుతానని చెప్పుకొచ్చారు. అది కూడా విద్యార్థుల అరెస్టులకు నిరసనగా.. ఆర్కే బీచ్ లో దీక్ష చేస్తారట.

అరెస్టయిన విద్యార్థులకు బెయిల్ రాకపోతే జైలుకెళ్లాల్సి వస్తుంది. ఒకవేళ నిజంగా ఆయన వారికి మద్దతు పలకాలంటే… ఇప్పుడే సరైన సమయం. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కేసులు మాఫీ చేయించే అవకాశముంది. కానీ ఆయన మాత్రం అది చేయరు. విద్యార్థులు జైలుకెళ్లిన తర్వాత దీక్ష చేస్తారట. ఇది దొంగలు పడ్డ ఆర్నెళ్లకు ఏదో చేసినట్టుంది.

ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తీరు మార్చుకోవాలంటున్నారు యువత. అనవసర ట్వీట్లతో యువతను రెచ్చగొట్టడం మినహా ఆయన చేసిందేమీ లేదని మండిపడుతున్నారు.ఇలాగైతే జన సేన … ట్వీట్ సేనగా మిగిలిపోతుందని ఎద్దేవా చేస్తున్నారు.

Leave a Reply