జగన్ ఎన్నికల ఆరాటం వెనుక పవన్?

Posted [relativedate]

Image result for jagan always talking elections because of pawan kalyan
ఆ దేవుడు దయతలిస్తే వచ్చే ఏడాది ఎన్నికలొస్తాయని జగన్ మరోసారి చెప్పారు.2014 ఓటమి తర్వాత కొన్ని నెలలకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.దానికి ఆపరేషన్ ఆకర్ష్ తో చంద్రబాబు ఘాటు సమాధానమివ్వడంతో కొన్నాళ్ళు జగన్ ముందస్తు ఎన్నికల అంశానికి ఇంటర్వెల్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి వచ్చే ఏడాది ఎన్నికల పల్లవి అందుకున్నారు.అసలు జగన్ ఎన్నికల కోసం ఇంతగా ఆరాటపడడానికి కారణం ఏంటి? నిజంగానే గెలుపు మీద ధీమానా? మరేదైనా అంశం అందుకు ప్రేరేపిస్తోందా? ఈ విషయాలపై ఆరా తీసినప్పుడు వైసీపీ ముఖ్యుల దగ్గరనుంచి ఆశ్చర్యకరమైన పేరు ముందుకొచ్చింది.అదే జనసేన అధినేత పవన్.

Image result for jagan always talking elections because of pawan kalyan

జనసేన అధినేత పవన్ సభల తర్వాత వైసీపీ నిర్వహించిన ఓ సర్వే జగన్ షాక్ కి ,ఎన్నికల ఆరాటానికి కారణమైంది.ఆ సర్వే లో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ, విపక్షాల్లో చీలిక వల్ల అధికార పార్టీ బలం తగ్గడం లేదని వచ్చిందట.పైగా మోడీ,బాబు వ్యతిరేక ఓటు అంతక ముందు పూర్తిగా వైసీపీ కే వచ్చేది.జనసేన సభల తర్వాత సర్వేల్లో ఆ ఓట్లలో చీలిక వచ్చిందట.పవన్ గ్రాఫ్ అంతకంతకు పెరగడం జగన్ ని ఆందోళన పరిచింది.పైగా కాలం గడిచే కొద్దీ జనసేన,వామపక్షాలు దగ్గర అవుతుండటం చూసి కలవరపడ్డ జగన్ ఎంత ముందుగా ఎన్నికలు జరిగితే నష్టం అంత తక్కువని డిసైడ్ అయ్యారు.అందుకే జగన్ ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు.అయినా రాజకీయాల్లో ప్రత్యర్థిని నిలువరించే వ్యూహాలు కావాలి గానీ కాలాన్ని ముందుకు జరపాలనుకోవడం అంత వివేకం కాదు.జగన్ కి ఈ విషయం ఆయన శ్రేయోభిలాషులు ఎవరైనా చెపితే బాగుండు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here