పవన్ పైనే ఆశలన్నీ ..ఉడుక్కున్న జగన్

Posted October 15, 2016

   pawan kalyan jagan fight mega aqua food park affected people
పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ని వ్యతిరేకిస్తున్న రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తమ గోడు వెళ్లబోసుకున్నారు.హైదరాబాద్ వచ్చిన వారితో ఇమేజ్ గార్డెన్స్ లో పవన్ సమావేశమయ్యారు.మీడియా సమక్షంలోనే పవన్ వారి సమస్యలు ఆలకించారు.రెండున్నరేళ్లుగా ఫుడ్ పార్క్ ఏర్పాటుని వ్యతిరేకిస్తున్నా ఫలితం లేకపోవడం వల్లే పవన్ ని అశ్రయించినట్టు రైతులు చెప్పారు.పార్క్ వల్ల గొంతేరు కాల్వ విషతుల్యమవుతుందని వారు పవన్ కి చెప్పారు.ఆ కాల్వపై ఆధారపడి రెండు లక్షల మంది జీవనం సాగిస్తున్నారని రైతు ప్రతినిధులు తెలిపారు.ప్రజాభిప్రాయ సేకరణ సక్రమంగా చేయకుండా ఫోర్జరీ సంతకాలతో ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణం చేస్తున్నట్టు వివరించారు.వ్యతిరేకిస్తున్న వారిపై దొంగ కేసులు పెట్టి వేధిస్తున్నారని పవన్ తో చెప్పారు.జనసేన అధినేత తమ సమస్యని పరిష్కరించగలరని భీమవరం రైతులు విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ పరిణామం వైసీపీ కి కంటగింపుగా మారింది.ఈ నెల 19 న జగన్ ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించారు.ఇన్నాళ్లు మౌనంగా ఉన్న పవన్ ఇప్పుడు బరిలోకి దిగడం వ్యూహాత్మకమేనని వైసీపీ డౌట్ పడుతోంది.జగన్ కి రావాల్సిన మైలేజ్ రాకుండా పవన్ అడ్డుకుంటున్నారని వైసీపీ అధినేతతో పాటు ఆ పార్టీ శ్రేణులు ఉడుక్కుంటున్నాయి.

SHARE