ఫిబ్ర‌వ‌రి 8న జ‌గ‌న్-ప‌వ‌న్ భేటీ?

Posted February 4, 2017

pawan kalyan jagan meets together in lotus pond
వైసీపీ అధినేత జ‌గ‌న్, జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ కానున్నారా..? త్వ‌ర‌లోనే ఆ భేటీ జ‌ర‌గ‌నుందా..? అందుకు ముహూర్తం, వేదిక‌ కూడా ఖ‌రారైపోయిందా..? ప్ర‌స్తుతం రాజ‌కీయవ‌ర్గాల్లో ఈ విష‌యంపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

హోదా పోరుపై ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇటీవ‌ల క‌లిసి న‌డుద్దామంటూ వైసీపీకి హింట్ ఇచ్చారు. ఈ ఓపెన్ ఆఫ‌ర్ పై ఇన్నాళ్లూ డైలమాలో ఉన్న జ‌గ‌ర‌న్ ఎట్ట‌కేల‌కు స్పందించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఎలాగూ… టీడీపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేయ‌డానికి వైసీపీ ఒక్క‌టే స‌రిపోవ‌డం లేదు. దీంతో మ‌రో పార్టీ బ‌లం కూడా కావాల‌ని జ‌గ‌న్ కోరుకుంటున్నారు. అది కూడా ప‌వ‌న్ లాంటి జ‌నాక‌ర్ష‌ణ ఉన్న నేత అయితే వైసీపీకి మ‌రింత ప్ల‌స్ అవుతుంది. అందుకే పొత్తుల‌కు అంత‌గా సుముఖ‌త వ్య‌క్తం చేయ‌ని జ‌గ‌న్… ప‌వ‌న్ విష‌యంలో మాత్రం దిగి వ‌చ్చార‌ట‌. ప‌వ‌ర్ స్టార్ తో చేతులు క‌లిపేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చేశార‌ట‌.

ఇద్ద‌రు నాయ‌కుల త‌ర‌పు నుంచి దూత‌లు రంగంలోకి దిగార‌ట‌. జ‌గ‌న్ త‌ర‌పున నుంచి అంబ‌టి రాంబాబు.. ప‌వ‌న్ త‌ర‌పు నుంచి ఓ ప్ర‌ముఖ నాయ‌కుడు.. మీటయ్యాట‌ర‌. ప‌వ‌న్-జ‌గ‌న్ ఏం చేయాల‌నుకుంటున్నారు.. ఇద్ద‌రు క‌లిస్తే ఎలా ఉంటుంది…ప‌వ‌న్-జ‌గ‌న్ భేటీకి స‌రైన స‌మ‌యం ఎప్పుడు… వేదిక.. ఇవ‌న్నీ చ‌ర్చించార‌ట‌. ఇద్ద‌రూ క‌లిస్తే.. హోదా విష‌యంలో అద్భుతాలు చేయొచ్చ‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. హోదాపైనే కాదు.. ఇక‌ముందు కూడా ఈ క‌ల‌యిక కొన‌సాగాల‌ని రెండు వ‌ర్గాలు ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయ‌ని టాక్. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌రకు… ఆ త‌ర్వాత కూడా ఈ దోస్తానా కొన‌సాగేలా ప్లాన్ జ‌రుగుతోంద‌ట‌.

జ‌గ‌న్ స‌న్నిహితుల వాద‌న ప్ర‌కారం చూస్తే… ఫిబ్ర‌వరి 8న ప‌వ‌న్ స్టార్, జ‌గ‌న్ భేటీ కానున్నార‌ట‌. లోట‌స్ పాండ్ వేదిక‌గా మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ భేటీ జర‌గ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఈ భేటీ కోసం ఇద్ద‌రు నాయ‌కులు ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు కూడా మొద‌లుపెట్టార‌ట‌. ఇద్ద‌రూ క‌ల‌వ‌డం అసాధ్య‌మ‌న్న అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ.. ప‌వ‌న్ -జ‌గ‌న్ భేటీ జ‌ర‌గ‌నుండ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నిజంగానే ఈ ఇద్ద‌రూ క‌లిస్తే… హోదాపై ఏమైనా జ‌ర‌గొచ్చ‌న్న‌ది విశ్లేష‌కుల వాద‌న‌.

SHARE