Saturday, October 23, 2021
Homelatestలోక్ సత్తా బ్యాక్ ఆన్ ట్రాక్... వెనుక పవన్ హ్యాండ్?

లోక్ సత్తా బ్యాక్ ఆన్ ట్రాక్… వెనుక పవన్ హ్యాండ్?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
లోక్ సత్తా … నిజాయితీ, విలువలు, విజన్ తో కూడిన రాజకీయాలు నడవాలని కోరుకున్న ఎంతోమందికి కనిపించిన ఆశాజ్యోతి. అలాంటి పార్టీ రాను వచ్చింది. పోను పోయింది. ఇప్పటి రాజకీయాల్లో ఇమడలేని క్లిష్టతని ఆ పార్టీ ఎదుర్కోలేకపోయింది. దీంతో సమాజం తమని ఆదరించే పరిస్థితులు లేనప్పుడు ఇక రాజకీయం చేయడంలో అర్ధం లేదని లోక్ సత్తా భావిస్తున్న సమయంలో విభజన పోరాటం, పరిణామాలు ఆ పార్టీ అస్తిత్వాన్ని ఇంకా త్వరగా సందేహంలోకి నెట్టి పడేశాయి. ఫలితంగా మాజీ ఐఏఎస్ జయ ప్రకాష్ నారాయణ ఎన్నో ఆశలు, ఆశయాలతో పెట్టిన పార్టీ ఇక రాజకీయాలకు సెలవంటూ తన రూట్ మార్చుకుంది. అయితే ఆ పార్టీ ని మళ్లీ గాడి ఎక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకుని లోక్ సత్తా పునరుద్ధరణ కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్న పవన్ అధికారం వచ్చినా, రాకపోయినా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్న తలంపుతో జయ ప్రకాష్ నారాయణ తో ఒకటిరెండు దఫాలు మాట్లాడారట. ఆ టైం లో పార్టీలోకి కూడా ఆయన్ని ఆహ్వానించారట. అయితే రాజకీయాల్లో ఎదురైన అనుభవాలు పంచుకున్న జయప్రకాశ్ తాను కూడా సగటు రాజకీయ నేతలా పార్టీ మారి సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని అడగడంతో పవన్ ఆలోచనలో పడ్డారట. అయితే 2019 ఎన్నికల నాటికి లోక్ సత్తా మళ్లీ పునరుద్ధానం చెంది తమ కూటమితో కలిసి పని చేస్తే బాగుంటుందని జయ ప్రకాష్ తో అన్నారట. తనకున్న ప్రజాకర్షణ, జయ ప్రకాష్ కి వున్న అనుభవం కలిస్తే బాగుంటుందన్న పవన్ ప్రతిపాదనని లోక్ సత్తా సీరియస్ గా పరిశీలిస్తోందట. ఈ విషయం అడపాదడపా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి దాకా దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. తాజాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 2019 ఎన్నికల నాటికి లెఫ్ట్, జనసేన, లోక్ సత్తా తో కూడిన ఓ కూటమి ఏర్పాటుకి ప్రయత్నాలు సాగుతున్నట్టు నిర్దారించడంతో ఈ విషయం మీద మళ్లీ ఫోకస్ పడింది. ఈ ప్రతిపాదన నిజమైతే లోక్ సత్తా తిరిగి ట్రాక్ ఎక్కడంలో పవన్ హ్యాండ్ వున్నట్టే.

- Advertisment -
spot_img

Most Popular