బీజేపీతో పవన్ మిలాఖత్?

Posted December 23, 2016

pawan kalyan jana sena party and bjp party tie up
పవన్ కల్యాణ్- బీజేపీతో మిలాఖత్ అయ్యారా అన్న అనుమానం ఇప్పుడు అందరికీ కలుగుతోంది. ఎందుకంటే జనసేన అధినేత ఇటీవల ఐదు ప్రశ్నలతో జనం ముందుకొచ్చారు. రోజుకో క్వశ్చన్ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. మామూలుగానైతే రాజకీయ నాయకులెవరైనా.. ఎదుటి పార్టీని ప్రశ్న వేస్తే దానికి సదరు పార్టీ ఎదురు సమాధానం చెబుతోంది. కానీ బీజేపీ నుంచి ఆ ప్రశ్నలకు పెద్దగా సమాధానం రాలేదు.

ఒకవైపు పవన్ కల్యాణ్ బీజేపీని ఏకిపారేశారు. అయినా బీజేపీ నాయకులు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు. పవన్ కు ఇప్పటివరకు కౌంటరివ్వలేదు. అందుకే ఇదంతా గేమ్ ప్లాన్ లో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది.

నిజానికి ప్రత్యేక హోదా విషయంలో పవన్ కంటే ముందు టీడీపీ నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. ఒకదశలో విమర్శల వేడి పెరిగింది. ఈ తరుణంలో బీజేపీ నేతలు టీడీపీ స్వరాన్ని తగ్గించేందుకు పవన్ ను తెరపైకి తెచ్చారట. పవన్ ను ప్రశ్నలు వేయించి.. టీడీపీని సైలెంట్ చేయించాలన్నది వారి ఆలోచన అని టాక్. అదే ప్లాన్ అమలు చేశారు కూడా. అది వర్కవుట్ కూడా అయ్యిందని చెబుతున్నారు.

ఒకవైపు బీజేపీ నేతలు సైలెంట్ అయిపోవడం.. పవన్ మాత్రం ప్రశ్నిస్తూనే ఉండడం.. అటు టీడీపీ ఈ రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ లో జోక్యం చేసుకోకపోవడం చూస్తుంటే… ఏదో జరిగిందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కచ్చితంగా బీజేపీ-జనసేన మధ్య టై అప్ జరిగిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పవన్ కంటే బీజేపీకే ఎక్కువ లాభం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

SHARE