పవన్ మూడో సభ ఎప్పుడు..ఎక్కడంటే?

 Posted October 24, 2016

pawan kalyan janasena party meeting anantapuramజనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా పనుల్లో వున్నారు ..రాజకీయాల్లో ఇప్పట్లో చురుగ్గా ఉండరేమో అనుకునే వాళ్లకి షాక్.ఈసారి సినిమా వ్యవహారాలూ చూసుకుంటూనే జనసేన మూడో సభకి పవన్ ప్లాన్ చేసుకున్నాడు.నవంబర్ 10 న,అనంతపురంలో జనసేన సభ జరగనున్నట్టు తెలుస్తోంది.పవన్ ముఖ్య అనుచరుల్లో ఒకడైన గౌతమ్ అనంతపురం వచ్చి అభిమానులు,కార్యకర్తలతో సమావేశం కావడంతో విషయం బయటికి వచ్చింది.తిరుపతి,కాకినాడ సభల్లో ప్రత్యేక హోదా అంశం మీద పవన్ మాట్లాడారు.అప్పట్లో జనంలోనూ ఆ భావోద్వేగాలు బలంగా కనిపించాయి.కేంద్రం ప్యాకేజ్ ప్రకటన తర్వాత కన్నా..దానిపై విస్తృత ప్రచారం తర్వాత భావోద్వేగపు వేడి తాత్కాలికంగానైనా తగ్గింది.

తొలి,రెండో సభల్లో పవన్ కేంద్రం మీద బాగానే విరుచుకుపడ్డారు.అనంతపురం సభలో అయన వైఖరి ఎలా ఉంటుందనేది ఇప్పుడు కీలకం.పాత ధోరణిలోనే ముందుకెళతారా..లేక కొత్త వైఖరి ప్రదర్శిస్తారా అనేది తేలాల్సివుంది.పైగా తిరుపతి,కాకినాడ తో పోల్చుకుంటే అనంతపురం భిన్నమైన రాజకీయ వాతావరణం కలిగిన ప్రాంతం.అక్కడ పవన్ ప్రసంగం అయన రాజకీయ భవిష్యత్ వ్యూహాన్ని స్పష్టం చేసే అవకాశం వుంది.

SHARE