పవన్ సభకి ఆ హీరో వస్తాడా?

  pawan kalyan janasena party meeting kakinada  attend sivaji

ఆంధ్రుల ఆత్మగౌరవ సభ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో కూడా పాల్గొనే అవకాశముందా ? ఔననే అంటున్నాయి జనసేన వర్గాలు.ఆ హీరో మరెవరో కాదు ..ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరం గళం వినిపిస్తున్న శివాజీ..ఆయన హోదా విషయంలో మోడీ ,చంద్రబాబు సహా ఎందరిని టార్గెట్ చేసినా …ఒక్క పవన్ కళ్యాణ్ గురించి దూకుడు ప్రదర్శించలేదు.పైగా అయన ముందుకొస్తే హోదా ఉద్యమం బలోపేతమవుతుందని చెప్పారు.ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న పవన్ శివాజీతో మాట్లాడినట్టు తెలుస్తోంది.ఆయన్ని కాకినాడ సభకి ఆహ్వానించినట్టు సమాచారం .శివాజీ కూడా పవన్ పట్ల సానుకూల దృక్పధం తో ఉన్నట్టు చెబుతున్నారు.

SHARE