రేపు జనసేన సమరభేరి ..

  pawan kalyan janasena party meeting tomorrow tirupathi
తిరుమల శ్రీవారి పాదాల చెంత …అన్న చిరంజీవి ప్రజారాజ్యం ప్రభవించిన చోట …తిరుపతి వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వీడబోతున్నారు.ఓ సినీ నటుడిగా కాకుండా ఓ రాజకీయవేత్తగా భారీ బహిరంగ సభను ఆయన తలపెట్టారు.నిన్న అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు తిరుపతి వెళ్లిన పవన్ తరువాత తిరుమల వెళ్లారు.స్వామి వారి దర్శనం తరువాత కూడా అయన కొండపైనే బస చేశారు.తనకు అతి సన్నిహితులతో మంతనాలు సాగించారు.జనసేన విధివిధానాలు,లక్ష్యాలు గురించి కసరత్తు చేశారు.

ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేపే తిరుపతిలో జనసేన సభ ఉంటుందన్న సంకేతాలు బయటికి వచ్చాయి.అయితే ఎక్కడో అనుమానం ..రాజకీయాల్లో ఇంత హఠాత్ నిర్ణయాలుంటాయా అనుకునేలోపే ..ఆ సందిగ్ధానికి తెర పడింది.టీటీడీ బోర్డు సభ్యుడు,పవన్ సన్నిహితుడు పసుపులేటి హరిప్రసాద్ సభకి సంబంధించిన అనుమతుల కోసం పోలీసుల్ని కలవడంతో పిక్చర్ క్లారిటీ వచ్చింది.రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలు,హోదా అంశం లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి …కాపు రేజర్వేషన్లు …రాజధాని నిర్మాణంలో వస్తున్న అవినీతి ఆరోపణలు …ఇలా లెక్కకి మించిన అంశాలు ..వాటిపై జనసేన అభిప్రాయం తెలుసుకోడానికి ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జనసేన ఏర్పాటు ..ఆ తర్వాత కూడా ప్రెస్ మీట్ లు కాకుండా పార్టీ వాణి వినిపించేందుకు ..బాణి తెలియచెప్పేందుకు పవన్ విస్తృత స్థాయిలో చేస్తున్న తొలి ప్రయత్నం ఇది .అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయం ఓ యుద్ధమే..తిరుపతి సభ జనసేనాధిపతి మోగిస్తున్న సమరభేరి ..

SHARE