పవన్ ప్రశ్నిస్తాడా?ఇన్నాళ్ల మౌనానికి జవాబిస్తాడా?

 pawan kalyan janasena party meeting
ఎవరు ఔనన్నా..ఎవరు కాదన్నా పవన్ రాష్ట్రరాజకీయాల్లో ఓ సంచలనం ..ఓ ప్రభంజనం ..2014 ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది .అయన బలపరిచిన టీడీపీ,బీజేపీ కూటమి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో జయకేతనం ఎగరేసింది.ఆ ప్రచార సమయం లోనే పవన్ ప్రజలకి ఓ మాటిచ్చాడు. చంద్రబాబు అనుభవాన్ని ,మోడీ సామర్ధ్యాన్ని చూసి జనసేన వారికి మద్దతిస్తోందని ..అయితే వారు అధికారంలోకి వచ్చాక ఏదైనా తప్పు జరిగితే ప్రజల తరపున తానే ప్రశ్నిస్తానన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో అలాంటి సందర్భాలు ఎన్నో వచ్చాయి.అమరావతి భూసేకరణ అంశంలో పవన్ రెండుసార్లు ఎక్కడికెళ్లారు.ప్రభుత్వ వివరణ తర్వాత మౌనం వహించారు.ఆయన టేక్ అప్ చేసిన విషయం ఇప్పటికీ అక్కడ నాలుగుతూనే వుంది.ఇక అత్యంత సున్నితమైన కాపు రిజర్వేషన్ అంశం మీద కూడా పవన్ నోరు విప్పలేదు.రత్నాచల్ ఘటనపై మాత్రం ఆలా జరగకుండా రెండు వర్గాలు సంయమనం పాటిస్తే బాగుండేదన్నారు.

ఇక కేంద్రం లోని మోడీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కింది.ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టింది.ప్యాకేజ్ అని అంటుందే తప్ప కచ్చితమైన విధివిధానాలు ఏమీ లేకుండానే. రెండేళ్లు గడిపింది .ఇటీవల కాస్త రాజకీయ వేడి పెరగడంతో కసరత్తు చేస్తున్నట్టు చెబుతోంది .ఈ విషయం మీద అప్పుడప్పుడు మాట్లాడిన పవన్ ఇటీవల కాస్త నిర్వేదంగా ఇంతమంది ప్రజాప్రతినిధుల వాళ్ళకానిది తానొక్కడి వల్ల ఏమవుతుందని అన్నారు.

వీటితోపాటు నిధుల లోటుతో చంద్రబాబు సర్కార్ రుణమాఫీ వంటి అంశాల్లో పాక్షికంగానే మాట నిలబెట్టుకుంది.ఇదీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు.తిరుపతి సభలో వీటిపై రెండు ప్రభుత్వాల్ని పవన్ నేరుగా ప్రశ్నిస్తారా? రెండేళ్ల మౌనానికి సమాధానం కూడా ఇస్తారా?ప్రశ్నలకి ,సమాధానాలకే పరిమితం కాకుండా జనసేన పోరాటానికి సమరశంఖం పూరిస్తారా? వీటన్నిటితో పార్టీ విధివిధానాలు,లక్ష్యాలు ప్రకటిస్తారా ?ఇవన్నీ ప్రజావేదిక మీద పవన్ వైఖరిని ..అయన భవిష్యత్ వ్యూహాల్ని ..రాజకీయ పరిణితిని తెలిపే విషయాలు ..

అయితే కొన్ని విషయాలు పవన్ గుర్తుంచుకోవాలి .సినిమాలు …రాజకీయం వేర్వేరు ..అక్కడ వెండితెరకు మాత్రమే నటన పరిమితం..ఇక్కడ ఇది ఇలా అనే కొలమానము ఉండదు.క్షణక్షణం ..అనుక్షణం ..పరిణామాలు ..పరిస్థితులు ..వ్యక్తులు ..వారి ప్రవర్తనలు …అన్నీ మారిపోతుంటాయి .ఏమరుపాటు లేకుండా వర్తమానంలో బతకాలి ..భావోద్వేగాల్ని పక్కనపెట్టి భవిష్యత్ ని అంచనా వేయగలగాలి .అన్నిటికీ మించి ఓటమిని ఎదుర్కోగలిగే ధైర్యం పెంచుకోవాలి ..అలాంటివారికే గెలుపు దక్కడం అంతర్లీనంగా కనిపించే ప్రకృతి నియమం ..అల్ ది బెస్ట్ పవన్ ..

SHARE