పవన్ నెక్స్ట్ సభ అక్కడే ..

Posted December 27, 2016

pawan kalyan janasena party next meeting in srikakulam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఉత్తరాంధ్రని టార్గెట్ చేస్తున్నారు .జనసేన తదుపరి సభని శ్రీకాకుళం లో నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది .జనవరి మూడో తేదీన సభ ఉంటుందని ..అందుకు తగ్గ ఏర్పాట్లు చూసుకోవాలని ఇప్పటికే పవన్ నుంచి పార్టీ శ్రేణులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది . రెండో తేదీన విశాఖ చేరుకునే పవన్ ఆ రాత్రికి అక్కడే బస చేస్తారని సమాచారం .మరసటి రోజు శ్రీకాకుళం సభలో పవన్ కీలక ప్రకటన చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి .ఇప్పటికే ప్రతి సభలో బీజేపీ ని టార్గెట్ చేస్తున్న పవన్ ఈసారి ఘాటు పెంచడం తో పాటు టీడీపీ ని కూడా లక్ష్యం చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది .ఇకపై తాను ఎన్ని సినిమాలు చేసేది …ఆపై పూర్తిగా రాజకీయాలకి సమయం కేటాయించేది పవన్ శ్రీకాకుళం సభ ద్వారా వెల్లడించే అవకాశముంది .

SHARE