మూడు నాలుగు సంవత్సరాలుగా హోదా ఇస్తామంటూ, తిపికబురు వస్తోంది అంటూ పాచి కంపు కొట్టే రెండు లడ్డూలిచ్చారని పవన్ అన్నారు. ఏపీకి హోదా ఇవ్వడానికి బదులు స్పెషల్ ప్యాకేజీని ప్రకటించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీ లడ్డూలకంటే మా బందరు లడ్డులు బాగుంటాయి కదా! మా తాపేశ్వరం కాజా ఇంకా బాగుంటుంది కదా! అని పవన్ అన్నారు. అవకాశవాదపు రాజకీయాల వల్ల గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకువచ్చారని పవన్ ఆరోపించారు. ఒక్కరు కాదు చాలామంది కలిపి నాలుగు దశాబ్దాలుగా మోసం చేస్తూనే ఉన్నారని, అందుకే కాకినాడకు వచ్చానని పవన్ తెలిపారు.