Posted [relativedate]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్. కొత్త సంవత్సరం తొలి రోజే ఫాన్స్ కి ఓ స్వీట్ షాక్ ఇవ్వబోతున్నాడు పవర్ స్టార్.జనవరి 1 న కాటమరాయుడు టీజర్ రిలీజ్ కాబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చిత్ర యూనిట్ ఆ తీపి వార్తతోపాటు మరో బోనస్ కూడా ప్రకటించింది.అదే కాటమరాయుడులో పవన్ హాఫ్ లుక్ విడుదల చేసింది.ఈ హాఫ్ లుక్ లో పవన్ మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు.కేవలం కాళ్ళు కనిపించేలా ఫోటో బయటికి వదిలారు.
కొన్నాళ్లుగా పవన్ లో పొలిటికల్ యాంగిల్ మాత్రమే చూస్తున్న ఫాన్స్ కి ఇప్పుడు ఓ సినిమా లుక్ లో పవన్ దాగుడుమూతలు ఆడేశారు . కాటమరాయుడు పోస్టర్ లో పంచె, చెప్పులు మాత్రమే కనిపించాయి.అయినా పవర్ స్టార్ ఫాన్స్ హ్యాపీ గానే వున్నారు.పవన్ ని కాటమరాయుడిగా తమకి నచ్చిన విధంగా ఊహించుకుంటూ జనవరి 1 న రిలీజ్ అయ్యే టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు.